అల్లు అర్జున్ రాకా నెక్స్ట్ ఇయర్ రాదా?
Raaka moves to 2028?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా మార్కెట్ లో క్రేజీ హీరోగా మారారు. ఆ క్రేజ్ తోనే అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో భారీ బడ్జెట్ తో రాకా చిత్రం చేస్తున్నారు. ముంబై లోనే మేజర్ పార్ట్ షూటింగ్ చేస్తున్న రాకా చిత్రాన్ని సంబందించిన అప్ డేట్స్ కోసం అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు.
ఎప్పుడో అల్లు అర్జున్ బర్త్ డే కి రాకా లుక్ వదిలిన టీమ్ ఇప్పటివరకు మరో అప్ డేట్ అందించలేదు. ఆగష్టు లో రాకా సర్ ప్రైజ్ అప్ డేట్ వస్తుంది అన్నా అది లేదు. సెప్టెంబర్ వచ్చేసింది. అయితే తాజాగా అల్లు ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ వినిపిస్తుంది. అదేమిటంటే రాకా చిత్రం వచ్చే ఏడాది రాకపోవచ్చు.
2027 లో రాకా రాదు, అందుకే అట్లీ అండ్ టీమ్ రాకా అప్ డేట్స్ వదలడం లేదు. 2028 లోనే రాకా వస్తుంది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి రాకా 2027 నుంచి 28 కి వెళ్ళిపోతే అభిమానుల్లోనే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ లోను నిరాశ తొణికిసలాడుతుంది. ఒకవేళ దీపికా ప్రెగ్నెన్సీ వల్ల సినిమా లేట్ అవుతుందా, లేదంటే అట్లీ గ్రాఫిక్స్ వల్ల లేట్ అవుతుందా అనే సందేహాలు వినిపిస్తున్నాయి.
















































