సోషల్ మీడియా టాక్ హెల్ప్ అవుతుందా ?
Social Media Talk
అక్కినేని హీరో కెరీర్ లో బ్రేక్ తీసుకుని మళ్లీ యాక్టీవ్ అయ్యారు. అనగనగ చిత్రంతో ట్రాక్ లోకి వచ్చారు. ఆతర్వాత వరస ప్రాజెక్ట్స్ ను ఒప్పుకుంటూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు దించుతున్నారు. గత ఏడాది రిలీజ్ అయిన అనగనగ చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చింది.
ఈ ఏడాది సుమంత్ న్యూటన్స్ థర్డ్ లా చిత్రం విడుదలైంది. ఈ చిత్రం థియేటర్స్ లో ఐదు కోట్లు కలెక్ట్ చేసింది. ఆతర్వాత వెంటనే సుమంత్ నుంచి మహేంద్రగిరి వారాహి ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి థియేటర్స్ లో నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. క్రిటిక్స్ పూర్ రివ్యూస్ ఇచ్చారు.
సుమంత్ మహేంద్రగిరి వారాహి చిత్రం చూసిన వారు మహేష్ మురారి ని కాపీ కొట్టారంటూ యునానమస్ గా చెబుతున్నమాట. దేవుడి చుట్టూ కథ అల్లినప్పుడు దానిని తెరకెక్కించే విధానం తెలియాలి అంటూ దర్శకుడిని ఏకి పడేసారు. తాజాగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మహేంద్రగిరి వారాహి సూపర్, బ్లాక్ బస్టర్ హిట్, సినిమా చాలాబావుంది అంటూ కొంతమంది పనిగట్టుకుని ట్వీట్లు వేస్తున్నారు(వేయిస్తున్నారో?).
మరి సోషల్ మీడియాలో మహేంద్రగిరి వారాహి ట్వీట్లు చూసి జనాలు థియేటర్స్ కి వెళతారా, సోషల్ మీడియా టాక్ ఈ చిత్రానికి ఎంత హెల్ప్ అవుతుందో చూడాలి.
















































