ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Swayambhu Release date announcement soon

అక్టోబర్ లో నిఖిల్ స్వయంభు?

Swayambhu Release date announcement soonSwayambhu Release date announcement soon

వచ్చే నెలలో నిఖిల్ స్వయంభు విడుదలయ్యే ఛాన్స్ ఉందా? అసలు దసరా బరిలో స్వయంభు విడుదల ఉంటుందా? నిర్మాతలు అక్టోబర్ లో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో అలాగే నిఖిల్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. నిఖిల్ స్వయంభు షూటింగ్ ఎప్పుడో ఏప్రిల్ లో పూర్తయ్యింది.

మే రిలీజ్ అన్నారు, ఆగస్టు అన్నారు, ఇప్పుడు అక్టోబర్ అంటున్నారు. తాజాగా మేకర్స్ కమింగ్ సూన్ అంటూ పోస్టర్ వదిలారు. అది ఎప్పుడు. వెయిట్ చేయిస్తున్నారు కానీ ఇంతవరకు స్వయంభు విడుదల తేదీ మాత్రం రివీల్ చెయ్యడమే లేదు. దానితో స్వయంభుని ఆడియన్స్ మర్చిపోతున్నారు. మరి దసరా రేస్ లోకి స్వయంభు వస్తే ఆ డేట్ ని ఎంత త్వరగా ప్రకటిస్తే అంత బావుంటుంది.

ఇప్పటికే దసరా బరి హాట్ గా మారిపోయింది. రజినీకాంత్ జైలర్ 2, విజయ్ దేవరకొండ రణబాలి, ధనుష్ ఓం లాంటి క్రేజీ చిత్రాలు వస్తున్నాయి. వీటి మధ్యన నిఖిల్ స్వయంభు ఉంటుందా, లేదంటే అక్టోబర్ ని కూడా మేకర్స్ చేజారుస్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. 

Swayambhu Release date soon