AK 47 టీజర్ : ఫ్యామిలీ మాత్రమే కాదు యాక్షన్ కూడా

Aadarsha Kutumbam Teaser ReviewAadarsha Kutumbam Teaser Review

 

వెంకటేష్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆదర్శ కుటుంబం - AK47 చిత్రం అక్టోబర్ 2 విడుదల అంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈచిత్రం అక్టోబర్ 2 నుంచి వెనక్కి తగ్గుతుంది అనే సమయంలో మేకర్స్ టీజర్ వదిలారు.

మధ్యతరగతి కుటుంబం, ఆ కుటుంబంలో చోటుచేసుకునే సరదా సంఘటనలు, వాటి చుట్టూ అల్లుకున్న వినోదం.. ఇలా ఆదర్శ కుటుంబం- AK47 టీజర్.. కుటుంబ నేపథ్యంతో కూడిన వినోదం, యాక్షన్, చమత్కారమైన సంభాషణలతో టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

'నాకు ఫ్యామిలీ ఇమేజ్ ఉందని నాకు తెలుసు, ఐనో.. కానీ డిమాండ్ చేస్తే యాక్షన్ చెయ్యడానికి వెనుకాడను..' అంటూ వెంకీ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్, వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్‌ డైలాగ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని టీజర్ లో హైలెట్స్ గా నిలిచాయి. 
 

Aadarsha Kutumbam House No: 4 Teaser Highlights