విశ్వంభర vs కాక

Vishwambhara vs KaakaVishwambhara vs Kaaka

 

మెగాస్టార్ విశ్వంభర పోయి పోయి ఆయన మరో సినిమా కాక పై దిగుతుందా? విశ్వంభర అన్ని డేట్స్ వదిలేసి సంక్రాంతికి వెళుతుందా, మరప్పుడు మెగాస్టార్ మరో మూవీ కాక పరిస్థితి ఏమిటి, దర్శకుడు బాబీ మాత్రం సంక్రాంతి బాక్సాఫీసు బరి నుంచి కాక ని తప్పించడానికి ససేమిరా అంటున్నారని తెలుస్తుంది.

మరి చిరు తన సినిమాపైకి తన సినిమానే పోటీకి వదులుతారా, విశ్వంభర బయటపడాలి అంటే ఏదో ఒక క్రేజీ డేట్ దొరకాలి. అది సంక్రాంతి అయితే ఇంకా బెటర్. విశ్వంభరను సంక్రాంతికి ఫిక్స్ చేస్తే ఎప్పుడో రిలీజ్ డేట్ లాక్ చేసిన కాక పరిస్థితి ఏమిటి అనేది మెగా అభిమానులు కాదు కాక కామన్ ఆడియన్స్ లో చర్చ మొదలయ్యింది.

మెగాస్టార్ చిరు కి రెండు సంక్రాంతులు కావాలేమో అంటూ కామెడీ చేస్తున్నారు. ముందు నుంచి ఉన్న ప్లాన్స్ ప్రకారం కాక ను పర్ఫెక్ట్ గా సంక్రాంతికి విడుదల చేద్దామంటే విశ్వంభర అడ్డుపడుతుంది. మరి విశ్వంభరను సంక్రాంతికి విడుదల  చెయ్యాలా, లేదంటే కాక ని విడుదల చెయ్యాలా అనేది ఫైనల్ డెసిషన్ చిరు చేతిలో ఉంది అంటున్నారు. చూద్దాం ఏ సినిమా ఎప్పుడు అనేది. 

Megastar vs Megastar