తెలుగులో లేట్ గా వర్కౌట్ అవుతుందా
Hanuman Ansh releasing in telugu
మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాదు, రూ.200 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అయిన తర్వాత అంటే మలయాళంలో విడుదలైన రెండు వారాలకు డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేసిన బెత్లెహెం కుటుంబ యూనిట్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు. మలయాళంలో ఎంత పెద్ద హిట్ అయినా.. హా ఓటీటీ లో చూద్దాం లే అని తెలుగు ఆడియన్స్ ఆ చిత్రాన్ని థియేటర్స్ లో పట్టించుకోలేదు.
ఇప్పుడు అదే మాదిరి గత నెల ఆగష్టు 7 న విడుదలైన హనుమాన్ అన్ష్ చిత్రం ఎన్ని రికార్డ్ లు క్రియేట్ చేసిందో చూస్తున్నాం. తక్కువ బడ్జెట్ తో విశాల్ చతుర్వేది ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు. హనుమాన్ అవతారంగా చెప్పబడే ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా జీవితం, బోధ నల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.
ఈ చిత్రం థియేటర్స్ లో విడుదలైన రెండు వారాలు ఎలాంటి చప్పుడు చెయ్యకపోయినా సోషల్ మీడియా, మౌత్ టాక్ తో రూ.100 కోట్లు కు చేరువైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ లో బడ్జెట్ చిత్రం థియేటర్స్ లో దగ్గరదగ్గర రూ.100 కోట్లు గ్రాస్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ తెలుగులో విడుదల చేస్తున్నారు.
సెప్టెంబర్ 18 అంటే ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఆగష్టు 21 న విడుదలైతే తెలుగులో సెప్టెంబర్ 18 న విడుదలవుతుంది. మరి ఈ చిత్రంలో తెలుగులో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.
















































