ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vishwanath and Sons trending on Netflix

థియేటర్స్ లోనే కాదు ఓటీటీ లోను బ్లాక్ బస్టరే

Vishwanath and Sons trending on NetflixVishwanath and Sons trending on Netflix


సూర్య లేటెస్ట్ చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రం ఆగష్టు లో థియేటర్స్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం రూ.260 కోట్లు వసూళ్లు చేసింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసారు తెలుగు ప్రేక్షకులు.

సూర్య సెటిల్డ్ పెరఫార్మెన్స్, మమిత బైజు, రాధికా కాంబో సీన్స్ , వెంకీ అట్లూరి డైలాగ్స్ ఆయన మేకింగ్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. అయితే ఈచిత్రం థియేటర్స్ లోనే కాదు ఇప్పుడు ఓటీటీ లోను బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సెప్టెంబర్ 11 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా విశ్వనాథ్ అండ్ సన్స్ స్ట్రీమింగ్ లోకి వచ్చింది.

థియేటర్స్ లో వీక్షించిన ఆడియన్స్ కూడా ఓటీటీ లో విశ్వనాథ్ అండ్ సన్స్ చూసేందుకు ఎగబడ్డారు. దానితో ఒక్కరోజు లోనే నెట్ ఫ్లిక్స్ లో విశ్వనాథ్ అండ్ సన్స్ నెంబర్ 1 పొజిషన్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి సూర్య ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్ థియేటర్ ఆడియన్స్ ని మాత్రమే కాదు ఓటీటీ ఆడియన్స్ ని కూడా తెగ ఇంప్రెస్స్ చేస్తుంది. 

Suriya's Vishwanath and Sons trending on Netflix