ప్యారడైజ్: ట్రైలర్ లేకుండానే బరిలోకి

No Trailer For The ParadiseNo Trailer For The Paradise

 


నాని ది ప్యారడైజ్ చిత్రం ఈ నెల 24 న విడుదల కాబోతుంది. విడుదలకు తక్కువ సమయం ఉండడంతో టీమ్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి... ప్యారడైజ్ నుంచి ఎలాంటి ట్రైలర్ లేకుండా ఈ నెల 24 న సినిమాని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి ట్రైలర్ లేకుండా సినిమాకి ఓపెనింగ్స్ ఎలా వస్తాయో అనేది సగటు ప్రేక్షకుడికి అర్ధం కాని విషయం.

ప్యారడైజ్ పాన్ ఇండియా ఫిలిం కాదు, వేరే భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నామని, ప్రమోషన్స్ ని ఇంకా ప్లాన్ చేసుకోలేదు అని నాని చెప్పడం కూడా షాకింగ్ గా ఉంది. మరి ట్రైలర్ చూసి ఆడియన్స్ లో ఆసక్తి కలిగి టికెట్ బుక్ చేసుకుంటారు. కానీ ప్యారడైజ్ ట్రైలర్ వదలకపోవడమేమిటో అనేది నాని ఫ్యాన్స్ లోను తికమకగా ఉంది.

ప్యారడైజ్ ప్రెస్ మీట్ లో నాని మట్లాడుతూ..

అందరికీ నమస్కారం. మీ అందరినీ కలిసి చాలా రోజులవుతుంది. ఎప్పుడూ నా కెరీర్‌లో ఒక సినిమాకి మరో సినిమాకి ఇంత గ్యాప్ రాలేదు. ఈ ప్రెస్ మీట్‌కి వస్తూ ఉంటే నా ఫస్ట్ సినిమాకి ఎంత నెర్వస్‌గా ఉన్నానో అంతే నెర్వస్‌గా ఉన్నానని అనిపించింది. మైక్‌లో మాట్లాడడం అలవాటు తప్పింది. ఫైనల్‌గా సెప్టెంబర్ 24న వస్తున్నాం. మొదటి సినిమాకి చాలా గొప్ప సపోర్ట్ ఉంది. ఇదే సపోర్ట్ కొనసాగుతుందని నమ్ముతున్నాను.

ఆయా షేర్, ఏష నాగుల కట్ట, గ్లింప్స్, టీజర్.. సినిమా నుంచి ఏ కంటెంట్ ఇచ్చినా సరే అన్నిటికీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. మీరు సినిమాని అంతగా సొంతం చేసుకున్నట్టు చూస్తుంటే మా బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఈ సినిమాకి ఒక డెస్టినీ ఉంది అనే బలమైన నమ్మకం వచ్చింది.

సెప్టెంబర్ 24న ఆడియన్స్‌కి ఒక అద్భుతమైన అనుభూతిని అందించడానికి నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నాం. మా టార్గెట్ ఒకటే. మీరందరూ చాలా అంచనాలతో థియేటర్‌కి వస్తారని తెలుసు. మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక అడ్రినలిన్ పంపింగ్, హై ఇచ్చి ఇంటికి పంపించాలనేది మా తపన. మేమందరం దానికోసం కష్టపడుతున్నాం.. అని చెప్పారు.

 

Nani Promises An Adrenaline Packed Experience With The Paradise