ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 6 contestant Inaya Sulthana

బిగ్ బాస్ వల్ల ఏ ఉపయోగం లేదు: ఇనాయ

Bigg Boss Telugu 6 contestant Inaya SulthanaBigg Boss Telugu 6 contestant Inaya Sulthana

 

బిగ్ బాస్ లోకి వెళ్ళివాళ్ళు కొద్దిరోజులు తమకు బిగ్ బాస్ వల్ల పేరొచ్చేసింది అని తెగ ఊగిపోతారు. బిగ్ బాస్ కప్ గెలిచాక కొన్నిరోజులు స్టార్ మా లో హడావిడి చేస్తారు. కట్ చేస్తే మళ్లీ కనిపించరు. సీజన్ 1 నుంచి సీజన్ 9 వరకు అదే జరిగింది. కప్ గెలిచిన వారు కూడా సంతోషంగా ఉండడం లేదు, బిజీ అవ్వలేదు.

ఇక హౌస్ లోకి వెళ్లి టాస్క్ లు ఆడుతూ మిగతా వాళ్లతో మింగిల్ అవుతూ కనిపించడమే కాదు, బిగ్ బాస్ లో స్ట్రాటజీలు, అలాగే వేరే విషయాల్లో నెగిటివిటీని మూటగట్టుకుని బయటికొచ్చి ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు. బిగ్ బాస్ వల్ల మానసికంగా నలిగిపోతూ డిప్రెషన్ లోకి వెళ్ళినవాళ్ళు ఉన్నారు.

ఇక బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లో మొదట్లో సైలెంట్ గా ఉండి, అందంతో ఆకట్టుకుని సీజన్ చివరిలో ఆటతో హైలెట్ అయిన ఇనాయ సుల్తానా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ వల్ల తనకు ఎలాంటి ఉపయోగం లేదు అని, బిగ్ బాస్ వల్ల తనకేమి ఆఫర్స్ రాలేదు అని చెప్పింది.

అంతేకాదు బిగ్ బాస్ కి వెళ్లి చాలామంది నెగిటివిటి మూటగట్టుకున్నారు, కానీ నేను లక్కీగా పాజిటివ్ నెస్ తోనే బయటికి వచ్చాను, బిగ్ బాస్ వల్ల చాలామంది మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు. ఇక నేను సోషల్ మీడియాలో ఎక్కువగా ఫొటోస్ షేర్ చేయకపోవడానికి కారణం దిష్టి తగులుతుంది అని, అందుకే నా చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ విషయాలు చెప్పను అంటూ ఇనాయ సుల్తానా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Inaya Sulthana