డబ్బింగ్ vs స్ట్రయిట్: రెండు చేతులెత్తేశాయి
Dubbing vs Stright Movies
లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకుందామని ఈ వారం పొలోమంటూ బయలుదేరిన డబ్బిగ్ చిత్రాలు, స్ట్రయిట్ తెలుగు సినిమాలు అన్ని ఆడియన్స్ ని నిరాశ పరచారంలో పోటీపడ్డాయి. ఈ గురువారం సెప్టెంబర్ 10 న విడుదలైన తమిళ మూవీస్ సర్దార్ 2, మందాడి రెండు చిత్రాలు ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. రెండు చిత్రాలకు డిజాస్టర్ రివ్యూస్ వచ్చాయి.
సెప్టెంబర్ 10 నే విడుదలైన మరో తెలుగు స్ట్రయిట్ మూవీ మారెమ్మ కూడా షెడ్డుకెళ్ళిపోయింది. ఇక ఈ శుక్రవారం విడుదలైన రెండు తెలుగు మూవీస్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. అందులో క్రేజీ పెయిర్ ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జంటగా 90స్ దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఎపిక్ ఒకటి.
ఈ చిత్రం విడుదలకు ముందు క్రేజీ ప్రమోషన్స్ తో అంచనాలు పెంచుకున్నా విడుదలయ్యాక జస్ట్ యావరేజ్ రివ్యూస్ తో సరిపెట్టుకుంది. యూత్ కి కనెక్ట్ అవుతుంది అన్నా సోషల్ మీడియా టాక్ చూస్తే ఎవరూ థియేటర్స్ కి వెళ్ళరు. ఓటీటీ కి వచ్చాక చూద్దాం లే అంటారు.
ఇక మరో మూవీ మహేంద్ర గిరి వారాహి. కొన్నేళ్లుగా నటనకు బ్రేకిచ్చి ఈమధ్యనే యాక్టీవ్ గా మారిన అక్కినేని హీరో సుమంత్ నటించిన మహేంద్రగిరి వారాహి కూడా ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చెయ్యడంలో తడబడింది. సో ఈ వారం విడుదలైన డబ్బింగ్ మూవీస్ కానీ, తెలుగు స్ట్రయిట్ మూవీస్ కానీ ప్రేక్షకులను డిజప్పాయింట్ చెయ్యడంలో నువ్వా-నేనా అని పోటీపడ్డాయి.







































