ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Double Elimination Rumours Surface in Bigg Boss 10

బిగ్ బాస్10: మిడిల్ వీక్ డబుల్ ఎలిమినేషన్

Double Elimination Rumours Surface in Bigg Boss 10Double Elimination Rumours Surface in Bigg Boss 10

 

బిగ్ బాస్ సీజన్ 10 మొదలై ఇంకా వారం పూర్తి కాలేదు. ఈ ఆదివారానికి బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయ్యి వారమవుతుంది. వారం గడవకముందే హై రిస్క్ అంటూ అప్పుడే ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవడం బుల్లితెర ప్రేక్షకులను అయోమయానికి గురి చేసింది. ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్ అంటూ నాగార్జున ఈ సీజన్ పై హైప్ క్రియేట్ చేసారు.

మొదటివారం హై రిస్క్ జోన్ లో ఉన్న రామ్ ప్రసాద్, కామనర్ చరణ్ లలో హౌస్ మేట్స్ ఆటో రామ్ ప్రసాద్ ని సేవ్ చేసి చరణ్ ని ఎలిమినేట్ చేసారు. చరణ్ ను బిగ్ బాస్ వాళ్ళు బయటికి తీసుకెళ్లిపోయారు. ఇక మరో కనెటస్టెంట్ చైత్ర రాయ్ కూడా ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తుంది. సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకుని బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది.

కానీ హౌస్ లో యాక్టీవ్ గా కనిపించని చైత్ర రాయ్ ఈ వారం వెళ్ళిపోతుంది అని చాలామంది అనుకున్నట్టుగానే హై రిస్క్ లో ఉన్న సుధీర్, అమన్ లు చైత్ర రాయ్ ని ఓట్ చేసి ఎలిమినేట్ అయ్యేలా చేసినట్లుగా తెలుస్తుంది. ఎప్పుడు శనివారం, ఆదివారం ఎలిమినేషన్ లో ఉండే కంటెస్టెంట్స్ ఇలా ఒకే వారంలో అది కూడా వచ్చిన మొదటి వారం లోనే ఇద్దరు కంటెస్టెంట్లు వెళ్లిపోవడం అటు హౌస్ మేట్స్ ని, ఇటు ఆడియెన్స్ ని కన్ఫ్యూజన్ లో పడేశాయి.
 

Bigg Boss 10