ఆ డిజాస్టర్ సీక్వెల్ ఆగలేదా?
Indian 3 gets back on track
లోక నాయకుడు కమల్ హాసన్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన భారతీయుడు కి సీక్వెల్ గా దర్శకుడు శంకర్ ఇండియన్-2 ని తెరకెక్కించారు. ఆ చిత్ర షూటింగ్ లో పలు వివాదాలు, విడుదలయ్యాక బిగ్ డిజాస్టర్ గా నిలిచింది భారతీయుడు-2. ఆ చిత్రం డిజాస్టర్ అయ్యాక దర్శకుడు శంకర్ సైలెంట్ అయ్యారో ఇప్పటికి చూస్తున్నాం.
అయితే భారతీయుడు 2 విడుదలకు ముందే దానికి సీక్వెల్ ప్రకటించారు. ఇండియన్-3 కి సంబందించిన షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయ్యింది. భారతీయుడు 2 డిజాస్టర్ అయ్యాక దానికి సీక్వెల్ గురించి అందరూ మర్చిపోయారు. అది విడుదలవ్వదు అని. అటు ఇండియన్-2 టీమ్ కూడా సైలెంట్ అవడంతో ఇకపై ఆ డిజాస్టర్ సీక్వెల్ ఉండదని ఫిక్స్ అయ్యారు.
కానీ సడన్ గా ఇండియన్-3 పై ఒక్కసారిగా న్యూస్ లు మొదలయ్యాయి. కమల్ హాసన్, శంకర్ కలిసి ఇండియన్-3 ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పుడు మిగిలిన షూటింగ్ పార్ట్, ప్యాచ్ వర్క్ కోసం కమల్, దర్శకుడు శంకర్ కలిసి ఇండియన్-3 సెట్ పైకి వెళ్ళబోతున్నారు. చాలా వరకు షూటింగ్ పూర్తయినప్పటికీ, ఇండియన్-3కి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చాలానే పెండింగ్ ఉన్నట్టు తెలుస్తోంది.
మరి మిగిలిన షూటింగ్ అలాగే పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇండియన్-3 ఎప్పుడు ల్యాండ్ అవుతుందో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ .







































