షాకింగ్: నటన ఆపేద్దామనుకున్న సమంత
Samantha almost quit acting after Myositis diagnosis
మయోసిటిస్ వలన అనారోగ్యం తో ఎంతో ఇబ్బంది పడిన సమంత ఆ వ్యాది నుంచి కోలుకుని మళ్లీ నటనకు రీ ఎంట్రీ ఇవ్వడమే కాదు.. దర్శకుడు రాజ్ నిడిమోరు ని ప్రేమించి రెండో వివాహం చేసుకుని ఇప్పుడు తల్లి కూడా కాబోతుంది. మాయోసైటిస్ వలన ఆమె నటనకు బ్రేక్ ఇచ్చింది. ఇక నటనకు సమంత ఫుల్ స్టాప్ పెడుతుందేమో అనుకున్నారు.
అందరూ అనుకోవడం కాదు సమంత కూడా ఒకొనొక సమయంలో నటనను ఆపేద్దామనుకుందట. ఆరోగ్యసమస్యల్తో సతమతమవుతూ.. పర్సనల్ లైఫ్ లో ఉన్న ప్రోబ్లెంస్ వలన ఆమె నటనకు గుడ్ బై చెబుదామనుకుందట. నటనకు బ్రేక్ ఇచ్చినప్పుడు ఆమె పలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టినట్లుగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఆరోగ్యం బాలేనప్పుడు నటనను పక్కనపెట్టి మరేదన్నా వృత్తిని ఎంచుకోమని డాక్టర్స్ చెప్పినప్పుడు భయపడ్డాను. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని వ్యాపారల్లో పెట్టుబడులు పెట్టాను. బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాక ఆ లైఫ్ ని ఆస్వాదిస్తున్నాను. ఇక సిటాడెల్ షూటింగ్ ని పూర్తి చేస్తాను అనుకోలేదు. ఆ షూటింగ్ సమయంలో టీమ్ కి నేను చెయ్యలేను అని ఎన్నో మెయిల్స్ పెట్టాను.
కానీ వారు నేనే నటించాలని గట్టిగా పట్టుబట్టారు. ఎలాగో అది పూర్తి చేశాను, ఇక మా ఇంటి బంగారం సమయంలోను కేవలం నిర్మాతగానే ఉండాలనుకున్నాను, కానీ రాజ్ ప్రోత్సాహం, బలవంతం వల్ల ఆ సినిమాలో నటించాను అంటూ సమంత నటనకు గుడ్ బై చెబుదామనుకున్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పి షాకిచ్చింది.







































