ప్రభాస్ డ్రాప్ - చైతు వచ్చేస్తున్నాడు
Naga Chaitanya's Vrushakarma eyes December 3 release
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం ఫౌజీ డిసెంబర్ 3 న విడుదల అని మేకర్స్ అనౌన్స్ చేసినా.. ఇప్పుడా తేదీ నుంచి తప్పుకుంటున్నారు అనే టాక్ నడుస్తుంది. ప్రభాస్ ఫౌజీ డిసెంబర్ 3 నంచి తప్పుకోవడంతో నాగ చైతన్య ఆ డేట్ ని ఆక్యుపై చెయ్యబోతున్నారనే వార్త వైరల్ అవుతుంది.
ప్రభాస్ తప్పుకోవడంతో చైతు వచ్చేస్తున్నాడు అంటున్నారు. నాగ చైతన్య-కార్తీక్ దండుల వృషకర్మ చిత్రాన్ని ముందుగా డిసెంబర్ 24 న విడుదల చేద్దామనుకుంటే ఆ సమయానికి చైతు తండ్రి, కింగ్ నాగార్జున తన #King 100 ని విడుదల చేస్తున్నారు. దానితో నాగ చైతన్య వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
కానీ ఇప్పుడు అదే డిసెంబర్ లో అంటే డిసెంబర్ 3 నుంచి ప్రభాస్ ఫౌజీ తప్పుకోవడం లాంఛనం అవడంతో నాగ చైతన్య వృషకర్మ ను ఆ డేట్ కు తీసుకురావాలని ప్లాన్ చెయ్యడమే కాదు రేపు అధికారికంగా డిసెంబర్ 3 రిలీజ్ అంటూ డేట్ లాక్ చేసి ప్రకటించబోతున్నారు.
You kept asking.
We kept you waiting.
But good things are always worth the wait. 🤗🤗🤗
THE WAIT ENDS
AS THE SUN SETS TOMORROW…
#Vrushakarma అంటూ వృషకర్మ టీమ్ ట్వీట్ చేసింది.







































