ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> YSRCP chief Jagan Mohan Reddy to begin Padayatra

పాదయాత్ర కు ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్

YSRCP chief Jagan Mohan Reddy to begin PadayatraYSRCP chief Jagan Mohan Reddy to begin Padayatra


తండ్రి వైస్సార్ చనిపోయాక సీఎం అవుదామని కలలు కన్నా జగన్ మోహన్ రెడ్డి కి అప్పటి కాంగ్రెస్ హ్యాండ్ ఇవ్వగా.. వైసీపీ పార్టీ పెట్టి తండ్రి మరణానంతరం ఓదార్పు యాత్ర చేసిన వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 2017 నుంచి 2019 వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమై.. 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది.

ఇప్పుడు మరోసారి జగన్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో వైఎస్ జగన్ తన పాదయాత్రపై వివరాలను వెల్లడించారు. దానికి సంబంధించి తాజాగా ముహూర్తం ఖరారు చేశారు. 2027లో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని స్పష్టత ఇచ్చారు.

వచ్చే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు. వైఎస్ జగన్ 2017 నుంచి 2019 వరకు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అనంతరం 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రెండోసారి పాదయాత్ర చేపట్టబోతున్నారు.
 

Jagan plans to undertake statewide padayatra in 2027