ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Congress High Command asks Konda Surekha to Resign

కొండా సురేఖ రాజీనామా చెయ్యాల్సిందే!

Congress High Command asks Konda Surekha to ResignCongress High Command asks Konda Surekha to Resign

 

కొండా సురేఖ ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన విషయం. కొండా సురేఖ కుమార్తె సీఎం రేవంత్ రెడ్డి ని విమర్శించడం పై కాంగ్రెస్ అధిష్టానం ఫైర్ అవుతుంది. సురేఖ ఎన్ని విధాలుగా కాంగ్రెస్ హై కమాండ్ ని కలిసి నచ్చజెప్పినా కొండా సురేఖ పై అధిష్టానం సీరియస్ గానే ఉంది.

తాజాగా కొండా సురేఖను రాజీనామా చేయాలని అధిష్ఠానం ఆదేశించింది. సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే, లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని హెచ్చరించారని తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చేలోపే కొండా సురేఖ రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుంది. అటు సురేఖ కూడా బర్తరఫ్ కంటే రాజీనామా చేయడమే మంచిదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.

మంత్రి పదవికి రాజీనామా చేయాలని, చేయకపోతే బర్తరఫ్ చేయాల్సి వస్తుందని, అక్కడి వరకు తెచ్చుకోవద్దని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం సురేఖకు సూచించినట్లుగా తెలుస్తుంది. ఈ విషయంలో పునరాలోచించాలని కోరినా కొండా సురేఖకు దక్కని ఊరట, ఇక మంత్రి పదవికి రాజీనామా చేశాక పార్టీలో కొనసాగడం అవమానకరమని, పార్టీకి కూడా రాజీనామా చేసే ఆలోచనలో కొండా సురేఖ ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Congress high command asked the Endowments Minister Konda Surekha to resign