పెళ్లి తర్వాత 3 మంత్స్ ఎడబాటు - రష్మిక
Rashmika on marriage 3 months
టాప్ హీరోయిన్ రష్మిక మందన్న మైస మూవీ షూటింగ్ లో గాయపడి గత కొన్ని రోజులుగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ గాయం నుంచి కోలుకుని మళ్లీ షూటింగ్ కి రెడీ అయ్యింది. ఆమె షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవడమే కాదు గాయమైనప్పుడు తాను ఇంట్లో ఎలా గడిపిందో అనేది చెప్పుకొచ్చింది.
విజయ్ దేవరకొండ తో పెళ్లి తర్వాత షూటింగ్స్ బిజీతో తాము ఒకరినొకరు కనీసం చూసుకోలేదు, కేవలం ఫోన్ లోనే మాట్లాడుకునేవాళ్ళం. కాస్త విశ్రాంతి ఇద్దాం. నిన్ను ఇంట్లోనే ఉంచుతా అని దేవుడే తనకు ప్లాన్ చేసి గాయం చేసినట్లుగా అనిపించింది. విజయ్ తో పెళ్లి తర్వాత మేము కలిసి ఎక్కువ సమయం గడిపింది ఇప్పుడే. మేమిద్దరం కలిసి ఇంట్లోనే చాలా అందంగా గడిపాము.
నాకు ఇంట్లో గడిపిన సమయం చాలా నచ్చేసింది. ఇక నాకు కొరియన్ డ్రామాలంటే ఇష్టం, విజయ్ సీరియస్ డ్రామాలు, షోస్ ఇష్టపడతాడు. మేమిద్దరం రెండు కలిసి చూసేవాళ్ళం, విజయ్ కి కూడా కొరియన్ డ్రామాలు అలవాటు చేసేసాను, ఇక విజయ్ నన్ను అల్లరిగా ఆట పట్టిస్తూ మనం ఇలా సరదాగా కలిసి గడపాలి కానీ గాయాలపాలై కాదు అంటూ ఏడిపించేవాడు అంటూ రష్మిక గాయంతో ఇంట్లో ఎలా రెస్ట్ తీస్కుందో చెప్పుకొచ్చింది.







































