ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> I M Game Telugu version shows cancelled

దుల్కర్ సినిమాకి తెలుగులో షాక్

 I M Game Telugu version shows cancelledI M Game Telugu version shows cancelled


సీతారామం, మహానటి, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవడమే కాదు.. తెలుగులో మార్కెట్ పెంచుకున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు టాలీవుడ్ లో షాక్ ఎదురైంది. ఆయన నటించిన ఐయామ్ గేమ్ చిత్రం ఈరోజు విడుదల కావాల్సి ఉంది. మలయాళం, తమిళ, తెలుగు భాషల్లోను ఈరోజు సెప్టెంబర్ 3 న దుల్కర్ ఐయామ్ గేమ్ విడుదలకావాల్సి ఉంది.

కానీ తెలుగులో దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ చిత్రం మార్నింగ్ షోస్ మాత్రమే కాదు, మ్యాట్నీలు కూడా కొన్ని చోట్ల రద్దయినాయి. ఐయామ్ గేమ్ నామమాత్రపు ప్రమోషన్స్ తో ఎలాంటి అంచనాలు లేకుండా ఒకటిరెండుసార్లు రిలీజ్ డేట్స్ మార్చుకుని ఫైనల్ గా ఈరోజు విడుదలకావాల్సి ఉండగా.. ఐయామ్ గేమ్ తెలుగు షోస్ క్యాన్సిల్ అయ్యాయి.

దుల్కర్ స్వీయ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగులో ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ హడావిడి చేసినా.. బుకింగ్స్ లో తెలుగు వెర్షన్ వెనుకబడిపోయింది. ఇప్పుడేమో షోస్ క్యాన్సిల్ అవడం మరింత షాకింగ్ విషయమని చెప్పాలి.
 

Dulquer Salmaan I M Game Telugu version shows cancelled