శ్రీ కృష్ణుడిగా రామ్ చరణ్ ?
Ram Charan to surprise as Lord Krishna
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ పెద్ది తర్వాత కుడి చేతిమణికట్టుకి సర్జరీ చేయించుకుని ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. మణికట్టు సర్జరీ నుంచి త్వరగా కోలుకుని చరణ్ దర్శకుడు సుకుమార్ తో RC16 మూవీ మొదలు పెట్టాల్సి ఉంది. ఈలోపు రామ్ చరణ్ శ్రీ కృష్ణుడిగా కనిపించబోతున్నారనే వార్త సడన్ గా వైరల్ అవుతోంది.
గుజరాత్‌లో ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యని విధంగా బ్లాక్ బస్టర్ గా నిలిచిన లాలో: కృష్ణ సదా సహాయతే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరగడమే కాదు.. ఈ రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్రకు రామ్‌చరణ్ పేరును పరిశీలిస్తున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. రూ.50 లక్షలతో తెరకెక్కిన లాలో: కృష్ణ సదా సహాయతే వరల్డ్ వైడ్ గా రూ.122 కోట్లకు పైగా వసూలు సాధించి సంచనలం సృష్టించింది.
లాలో: కృష్ణ సదా సహాయతే నిర్మాత మహవీర్ జైన్ తెలుగు రీమేక్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులోని శ్రీకృష్ణుడి పాత్ర కోసం రామ్ చరణ్ పేరు పరిశీలిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అయితే శ్రీకృష్ణుడి పాత్ర సినిమా మొత్తం ఉండదని, కేవలం గెస్ట్ రోల్ గా ఉంటుంది అని తెలుస్తుంది.
















































