ఆగష్టు సక్సెస్ సెప్టెంబర్ లో కంటిన్యూ అవుతుందా?
August will end well. September will start well
ఆగష్టు నెలలో విడుదలైన సినిమాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. థియేటర్స్ వద్ద ప్రేక్షకుల కిలకిలలు, బాక్సాఫీసు గలగలలు వినిపించాయి. ఆడియన్స్ సినిమాలు చూడాలనే ఇంట్రెస్ట్ తో థియేటర్స్ కి కదిలారు. ఆగష్టు 7 న విడుదలైన వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేష్ కనగరాజు డీసీ రెండు చిత్రాలు ఆడియన్స్ ని బాగా ఇంప్రెస్స్ చేసాయి.
ఇక అదే ఊపుని ఆగష్టు 14 న డబ్బింగ్ మూవీ అయిన సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ టాలీవుడ్ ఆడియన్స్ ఆకర్షించి విజయాన్ని కంటిన్యూ చేసింది. ఇక బ్యాక్ టు బ్యా ఆడియన్స్ థియేటర్స్ బాట పట్టారు. రెండు వారాలుగా ఆడియన్స్ ని ఉల్లాసంతో ముంచెత్తిన భారీ ఎంటర్టైనర్స్... ఆగష్టు 21 న విడుదలైన రవితేజ ఇరుముడి కూడా ఆ సక్సెస్ ని కంటిన్యూ చేసింది.
ఒకే నెలలో నాలుగు సినిమాల హిట్లు ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేసాయి. ఆగష్టు మొత్తం హిట్ల జాతరలో మునిగితేలింది. మరి ఆగష్టు లో వచ్చిన సక్సెస్ ఊపును సెప్టెంబర్ కంటిన్యూ చేస్తుందా, సెప్టెంబర్లోనూ క్రేజీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి అందులో ఎన్ని హిట్ అవుతాయో, సెప్టెంబర్ బాక్సాఫీసు రిజల్ట్ ఎలా ఉండబోతుందో జస్ట్ వెయిట్ అండ్ సి.







































