హిట్ అండ్ రన్ కేసులో పవన్ ఫ్రెండ్ కొడుకు అరెస్ట్
Anand Sai Sandeep Arrested Police Investigation Underway
సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితులు, స్నేహితులు ఇద్దరే ఇద్దరు. వారే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అలాగే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. ఆనంద్ సాయి తో పవన్ కళ్యాణ్ చాల ఏళ్ళ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. అయితే తాజాగా ఆనంద్ సాయి కొడుకు హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అవడం హాట్ టాపిక్ అయ్యింది.
ఓఆర్‌ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటన లో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హిట్ అండ్ రన్ కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆనంద్ సాయి కుమారుడు సందీప్.. కారు నడిపి ఒకరి మృతికి కారణమైనట్లు విచారణలో తేలింది.
దానితో పోలీసులు కారును సీజ్ చేసి సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన విద్యార్థి జైద్‌షా కద్రీని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.







































