రీ షూట్ మోడ్ లో జైలర్ 2
Rajinikanth's Jailer 2 Set for Reshoots
సూపర్ స్టార్ రజినీకాంత్-నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో క్రేజీ పాన్ ఇండియా సీక్వెల్ గా తెరకెక్కుతున్న జైలర్ 2 చిత్రం అక్టోబర్ 15 విడుదల అంటూ ఎప్పుడో రిలీజ్ డేట్ లాక్ చేసారు. కానీ ఇప్పుడు దసరా రేస్ నుంచి జైలర్ 2 తప్పుకోబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే జైలర్ 2 ని అక్టోబర్ 15 నుంచి దివాళి కి పోస్ట్ పోన్ చేస్తున్నారని అంటున్నారు. ఇపుడేమో జైలర్ లోని కొన్ని సన్నివేశాలు సాటిస్ఫేక్షన్ ఇవ్వకపోవడంతో నెల్సన్ దిలీప్ కుమార్ మళ్లీ ఆ సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నారనే వార్త నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఇప్పటికే జైలర్ 2 షూటింగ్ పూర్తికాగా రజినీకాంత్ మళ్ళీ జైలర్ 2 సెట్ లోకి వచ్చారట.
రజినీకాంత్ పై అలాగే ఇంకా కీలక నటులపై ఈ రీ షూట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లు గెస్ట్ రోల్స్ పోషిస్తున్నారు.







































