ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> OG 2-Fans are hoping for a major update on Pawan b-day

పవన్ బర్త్ డే స్పెషల్ ఏంటి?

OG 2-Fans are hoping for a major update on Pawan b-dayOG 2-Fans are hoping for a major update on Pawan b-day

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే కి మరొక్క రోజే సమయం ఉంది. సెప్టెంబర్ 2 అంటే పవన్ ఫ్యాన్స్ కి పండగ రోజు. మరి ఈసారి పవన్ కళ్యాణ్ బర్త్ డే ని ఫ్యాన్స్ ఎలా సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు, పవన్ కళ్యాణ్ బర్త్ డే కి ఆయనతో సినిమాలు కమిట్ అయిన మేకర్స్ ఎలాంటి ట్రీట్ సిద్ధం చేస్తున్నారు అని చాలామంది వెయిట్ చేస్తున్నారు.

మరి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయుర్వేద వైద్యం కోసం కేరళం వెళ్లారు. అక్కడే ఆయన ఫిజియోథెరపీ, ఇంకా ఆయుర్వేద చికిత్స చేయించుకుంటున్నారు. సో ఆయన హైదరాబాద్ లో లేరు. ఇక ఆయన సినిమా షూటింగ్స్ కూడా మొదలు కాలేదు. OG 2 ని అనౌన్స్ చేసినప్పటికీ.. పవన్ అనారోగ్యం దృష్ట్యా అది ఇంకా పట్టాలెక్కలేదు.

అంటే OG 2 కి సంబందించిన షూటింగ్ మొదలు కాలేదు. కాకపోతే పవన్ పై OG 2 స్పెషల్ ఫోటో షూట్ అయితే జరిగింది. అలా OG 2 నుంచి దర్శకుడు సుజిత్ ఏమైనా పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం సర్ ప్రైజ్ ప్లాన్ చేసారేమో అని అభిమానుల కోరిక. చూద్దాం పవన్ బర్త్ డే కి ఎలాంటి ట్రీట్ వస్తుందో అనేది.

 

Will Pawan Kalyan Fans Get OG 2 Surprise As Birthday