రాకా - దాని కోసం వెయిటింగ్

Raaka shooting updateRaaka shooting update

 

కింగ్ నాగార్జున తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం ఫ్యామిలీ తో కలిసి రెండు రోజుల ముందే వెకేషన్ కి వెళ్లిపోయారు. ఫ్యామిలీ అంటే తన ఇద్దరు కొడుకులు నాగ చైతన్య, అఖిల్ అలాగే వాళ్ళ వాళ్ళ భార్యలు, భార్య అమల తో కలిసి నాగ్ ఈసారి తన బర్త్ డే ని విదేశాల్లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు.

ఆగష్టు 29 న బర్త్ డే ని ఫ్యామిలీతో కలిసి సంతోషంగా సెలెబ్రేట్ చేసుకున్న కింగ్ ఇప్పుడు హైదరాబాద్ తిరిగొచ్చేశారు. నాగార్జున, అమల, అఖిల్, జైనాబ్ లు స్టైలిష్ గా తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పుడా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆయన కేరీర్లో మెయిలు రాయిగా నిలవబోయే చిత్ర టైటిల్ అండ్ రిలీజ్ డేట్ గ్లింప్స్ వదిలారు.

నాగార్జున స్టైలిష్ గా పవర్ ఫుల్ కేరెక్టర్ లో #King 100 లో కనిపించారు. అక్కినేని ఫ్యాన్స్ #King 100 గ్లింప్స్ తో ఫుల్ గా సాటిస్ఫాయ్ అయ్యారు. దీనితో పాటుగా నాగార్జున హోస్ట్ గా వచ్చే ఆదివారమే బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ మా గ్రాండ్ గా మొదలు కాబోతుంది. 
 

Raaka update