గాయం నుంచి కోలుకుని వర్క్ లోకి రష్మిక

Rashmika Mandanna set to resume workRashmika Mandanna set to resume work


నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొద్దిరోజులుగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంది. నిత్యం షూటింగ్స్ తో బిజీగా వుండే రష్మిక మందన్న మైసా సినిమా షూటింగ్ సెట్ లో గాయపడి విశ్రాంతి తీసుకుంటుంది. తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో ఎప్పుడు బిజీగా గడిపే రష్మిక కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటూనే కుటుంబంతో హ్యాపీగా గడిపేసింది.

ఇక గాయం నుంచి కోలుకోవడంతో రష్మిక షూటింగ్ కి రెడీ అవడమే కాదు.. వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుని ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. త్వరలోనే తిరిగి వర్క్ లోకి వెళుతున్నాను. ఫ్యామిలీతో గడిపిన ఈ సమయాన్ని నేను కచ్చితంగా మిస్సవుతాను అంటూ తను విశ్రాంతి లో ఉన్న సమయంలో ఏమేం చేసిందో ఆ ఫొటోస్ మొత్తం షేర్ చేసింది.

పెళ్లి తర్వాత రష్మిక భర్త విజయ్ దేవరకొండ తో హనీమూన్ కి వెళ్ళొచ్చింది. కానీ షూటింగ్స్ హడావుడితో ఆమె అత్తరింట్లో గడిపింది చాలా తక్కువ. కానీ ఈ గాయం కారణంగా రష్మిక అత్తారింట్లోనే గడిపింది. అలా తన పెళ్లి తర్వాత మొదటి వరలక్ష్మి పూజను సాంప్రదాయంగా అత్తారింట్లోనే చేసుకుంది. 

Rashmika Mandanna