బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్

Bigg Boss 10 Contestants List LeakedBigg Boss 10 Contestants List Leaked


బిగ్ బాస్ సీజన్ 10 మొదలు కావడానికి మరొక్క వారమే సమయం ఉంది. వచ్చే శని, ఆదివారాల్లో బిగ్ బాస్ 10 ని అఫీషియల్ గా మొదలు పెడుతున్నట్టుగా ప్రొమోతో అనౌన్స్ చేసారు. ఇప్పటికే కామనర్స్ కోసం అగ్నిపరీక్ష 2 నడుస్తుంది. వారిలో కొంతమందిని ఎంపిక చేసి హౌస్ లోకి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సీజన్ 10 హౌస్ కూడా హైదరాబాద్ నగర నడిబొడ్డున అన్నపూర్ణ స్టూడియోస్ లో అందంగా ముస్తాబవుతోంది. ఇక హోస్ట్ నాగార్జున కూడా బిగ్ బాస్ 10 ని ప్రమోట్ చేస్తూ మొదలు పెట్టేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ సీజన్ లోకి ఎవరెవరు అడుగుపెడుతున్నారో అనే విషయంలో సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.

అందులో జబర్దస్త్ నుంచి రాంప్రసాద్, నరేష్, అదిత్ అరుణ్, టెంపర్ వంశీ, యాక్టర్ వర్షిణి, కమెడియన్ కృష్ణుడు, సీరియల్ యాక్టర్లు ముఖేష్ గౌడ, దేబ్జానీ మోదక్, చైత్రారాయ్, సుధీర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి కామనర్స్ vs సెలబ్రిటీస్ అంటూ మరోమారు రచ్చ కు రంగం సిద్దమవుతుంది. 

Bigg Boss 10