కొరియన్ కనకరాజు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Korean Kanakaraju ott date locked
మెగా హీరో వరుణ్ తేజ్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన కొరియన్ కనకరాజు చిత్రం థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచింది. కొరియన్ దెయ్యం తెలుగు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ నటన మేర్లపాక గాంధీ మేకింగ్, వరుణ్ తేజ్-సత్య కామెడీ అన్ని అన్ని ప్రేక్షకులను బాగా ఇంప్రెస్స్ చేసాయి.
కొన్నాళ్లుగా ప్లాప్స్ లో ఉన్న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు తో మంచి హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యారు. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన కొరియన్ కనకరాజు చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. కొరియన్ కనకరాజు డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకుంది.
ఇప్పుడు కొరియన్ కనకరాజు చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. కొరియన్ కనకరాజు సెప్టెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. మరి థియేటర్స్ లో మిస్ అయిన ఈ చిత్రాన్ని ఓటీటీ లో వీక్షించేందుకు సిద్దమవ్వాల్సిందే.















































