మూన్నాళ్ళ ముచ్చటేనా?
Toxic talk
కన్నడ హీరో యశ్ నటించిన టాక్సిక్ మూవీది మూన్నాళ్ళ ముచ్చటేనా.. హాలిడే, ఆగష్టు 26 న విడుదలైన టాక్సిక్ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ అది కూడా బ్లాక్ బస్టర్ ధురంధర్ 2 ని కొట్టేంత ఓపెనింగ్స్ ప్రపంచ వ్యాప్తంగా వచ్చాయి. కానీ సినిమా విడుదలయ్యాక టాక్సిక్ పై సోషల్ మీడియా మొత్తం నెగిటివిటితో నిండిపోయింది.
మొదటినుంచి టాక్సిక్ ప్రమోషనల్ కంటెంట్ చూసి ఈ సినిమా ఏంట్రా ఇలా తీశారు అనుకున్నా టాక్సిక్ ట్రైలర్ తో సినిమాపై ఎంతో కొంత హైప్ వచ్చింది. మరోపక్క యశ్ కేజిఎఫ్ క్రేజ్ కూడా కలిసిరావడంతో టాక్సిక్ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. టాక్సిక్ కి పాన్ ఇండియా భాషల నుంచి వస్తోన్న టాక్ చూస్తే టాక్సిక్ హడావిడి మూన్నాళ్ళ ముచ్చట అని తేలిపోయింది.
శుక్రవారం రక్షా బంధన్ హాలిడే కూడా టాక్సిక్ క్యాష్ చేసుకోలేకపోయింది. సో ఈ వీకెండ్ బుకింగ్స్ తో టాక్సిక్ థియేటర్స్ కాస్త ఫుల్ అయినా సోమవారం నుంచి టాక్సిక్ వైపు ప్రేక్షకుడు కన్నెత్తి చూసే సూచనలు కనిపించడం లేదు. అంతేకాదు టాక్సిక్ ని చూడాలంటె నరకానికి కేరాఫ్ అడ్రెస్ కోసం టికెట్ కొనుక్కుని వెళ్లడమనే కామెంట్స్ చూస్తే టాక్సిక్ చూసే ధైర్యం నిజంగా ఎవ్వరూ చెయ్యరు.
టాక్సిక్ యశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలబోతుంది అనడంలో సందేహములేదు అంటూ నెటిజెన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.







































