టీడీపీ ని చూసి వైసీపీ నేర్చుకోవాల్సిందే

YCP certainly needs to learn from TDPYCP certainly needs to learn from TDP


టీడీపీ ని చూసి వైసీపీ నేర్చుకోవాల్సిందే ఇది మేమంటున్న మాట కాదు.. స్వయానా వైసీపీ కి అనుకూలంగా పని చేసే బ్లూ మీడియా చెబుతున్న మాట. టీడీపీ నేతల్లో క్రమశిక్షణ ఉంటుంది. కానీ వైసీపీ నేతల్లో అది ఉండదు. ఎవరికీ వారు స్వార్ధ ప్రయోజనాల కోసమే పని చేస్తారు తప్ప పార్టీ అధ్యక్షుడు కి పనికొచ్చే పని చెయ్యరు.

వైసీపీ లో నిరంతరం నెంబర్ 2 కోసం ఫైట్ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ జగన్ తర్వాత తామే అనే భావనలో ఉంటారు. పార్టీ కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పని చేస్తారు. అదే టీడీపి లో అయితే నెంబర్ 2 అనే మాటే ఉండదు. నెంబర్ 1 చంద్రబాబు, నెంబర్ 2 లోకేష్.. ఆతర్వాత స్థానం అనే మాట వినిపించదు. పార్టీ లో ఉన్నవారు కూడా అదే ఫాలో అవుతారు. అది వారిలో ఉండే క్రమశిక్షణ.

అక్కడ వారు ఎవరికీ తెలియకుండా పనులు చేయించుకుంటారు, అధ్యక్షుడి కోసం వేరే పార్టీలోకి చేరి ఇప్పటికి చంద్రబాబు కోసమే పని చేస్తారు. కానీ వైసీపీ లో అలా కాదు.. వైసీపీ లో ఉంటూ జగన్ కోసం నిబద్దతతో పని చేసేవారే ఉండదు. టీడీపీ నుంచి బయటికి వెళితే ఎంతో హుందాగా ఉంటారు తప్ప చంద్రబాబు ని విమర్శించరు.

కానీ వైసీపీ నుంచి ఎవరు బయటికెళ్లినా పార్టీ పరువు, జగన్ పరువు తీసేస్తారు. జగన్ తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి. అలా ఆయన్ను మ్యానేజ్ చేస్తారు. విజయసాయి రెడ్డి జగన్ చుటూ ఉన్న వ్యక్తుల వల్లే బయటికెళ్ళిపోయాను అన్నారు. అయినా జగన్ తెలుసుకోలేని అమాయత్వంలో ఉన్నారు.

పార్టీలో జరిగే ఏ ఒక్క విషయం జగన్ కు చేరదు అదే టీడీపీలో ఏది జరిగినా ముందు చంద్రబాబు కే తెలుస్తుంది. ఈ విషయంలో మాత్రం జగన్ చంద్రబాబు ని వైసీపీ టీడీపీ ని చూసి నేర్చుకోవాల్సిందే అంటూ వైసీపీ బ్లూ మీడియా కథనాలు రాయడం హాట్ టాపిక్ అయ్యింది. 

YCP - TDP