DC ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

DC OTT Streaming DetailsDC OTT Streaming Details

 

టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన DC చిత్రం థియేటర్స్ లో పెద్ద హిట్ అయ్యింది. సినిమా విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు లేని DC విడుదలయ్యాక ఎవ్వరూ ఊహించని బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళ్ లోనే కాదు విడుదలైన ప్రతి భాషలోనూ DC చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

ఆతర్వాత రెండు వారాలకు DC రూ.100 కోట్ల క్లబ్బులోకి వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచింది. లోకేష్ కనగరాజ్ గనక ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి ఉంటె సునాయాసంగా రూ.200 కోట్లు ఈ చిత్రం కొల్లగొట్టేది. ఇక థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయిన DC చిత్రం ఇప్పుడు ఓటీటీ లోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది.

ఆగష్టు 7 న విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 4 నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా ప్రకటించారు. అనిరుధ్ మ్యూజిక్ తో హిట్ అయిన DC చిత్రాన్ని సెప్టెంబర్ 4 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీ లో చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ రెడీ అవ్వాల్సిందే. 

DC To Stream On This OTT Platform From This Date