King 100 : రిలీజ్ డేట్ ఫిక్స్
King100 is gearing up for a December 2026 releas
మరికాసేట్లో టైటిల్ గ్లింప్స్ తో కింగ్ నాగార్జున కు బర్త్ డే విషెస్ చెప్పబోతున్న మేకర్స్ ఈ చిత్రాన్ని దసరా కి రిలీజ్ చెయ్యాలని ముందు భావించినా.. షూటింగ్, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ కాకపోవడంతో మేకర్స్ డిసెంబర్లో విడుదల చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అది కూడా డిసెంబర్ 24 క్రిస్మస్ హాలిడేస్ ని #King 100 టార్గెట్ చేయబోతున్నారు.
అదే విషయాన్ని టైటిల్ గ్లింప్స్ తోనే మేకర్స్ అనౌన్స్ చేసారు అని సమాచారం. నేడు ఆగష్టు 29 నాగార్జున బర్త్ డే. నాగ్ బర్త్ డే కి ఆయన ఫ్యామిలీతో అంటే భార్య అమల, పెద్దకొడుకు నాగ చైతన్య, కోడలు శోభిత తో కలిసి వెకేషన్ కి వెళ్లిపోయారు. ఇక్కడ ఆయన కెరీర్ లో స్పెషల్ గా నిలవబోతున్న #King 100 చిత్ర ట్రీట్ ని రెడీ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేసారు.
అనుకున్న సమయానికి కాస్త లేట్ గా విడుదల చేసారు. నాగార్జున పవర్ ఫుల్ లుక్ లో దర్శనమిచ్చారు. పవర్ ఫుల్ డైలాగ్స్ తో #King 100 గ్లింప్స్ అదిరిపోయింది. తమిళ దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో కనిపించబోతుంది.







































