టాక్సిక్ ని ఓటీటీ డీల్ బయటపడేస్తుందా

Toxic OTT rights reportedly soldToxic OTT rights reportedly sold


కన్నడ స్టార్ హీరో యశ్ లేటెస్ట్ చిత్రం టాక్సిక్. రెండు రోజుల క్రితమే విడుదలైన ఈ చిత్రానికి పాన్ ఇండియా లాంగ్వేజెస్ నుంచి డివైడ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. విడుదలకు ముందు ట్రైలర్ తో మంచి హైప్ తీసుకొచ్చిన మేకర్స్.. ప్రస్తుతం థియేటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి షాకవుతున్నారు.

టాక్సిక్ పై సోషల్ మీడియాలో భీభత్సమైన ట్రోల్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈచిత్రానికి విడుదలకు ముందు ఓటీటీ డీల్ అవ్వకపోవడంతో కెవిఎన్ ప్రొడక్షన్ వారు సినిమా విడుదల ఆలస్యం చేశారనే ప్రచారం జరిగింది. రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన టాక్సిక్ చిత్రానికి ఈ టాక్ చూసి ఏ ఓటీటీ కొంటుంది అనుకున్నారు చాలామంది.

కానీ టాక్సిక్ చిత్రాన్ని డిజిటల్, ఆడియో, శాటిలైట్ ఇలా అన్ని కలిపి జీ సంస్థ భారీ డీల్ తో పాన్ ఇండియా లాంగ్వేజెస్ కి కలిపి దాదాపుగా రూ.230 కోట్లు వెచ్చించింది అని తెలుస్తుంది. అంటే టాక్సిక్ థియేటర్ రెవిన్యూ ఎలా ఉన్నా నిర్మాతలు ఈ డిజిటల్ రైట్స్ తో చాలావరకు బయటపడిపోయినట్లే అని తెలుస్తుంది. చూద్దాం టాక్సిక్ వల్ల బయ్యర్లు ఎన్ని నష్టాలు చూస్తారో అనేది. 
 

Yash's Toxic OTT rights reportedly sold for Rs 230 crore