డేట్ మార్చుకున్న దేవరకొండ సినిమా
Ranabaali Gets a New Release Date
విజయ్ దేవరకొండ లేటెస్ట్ చిత్రం రణబాలి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11 న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ ఆ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడం, హీరోయిన్ రష్మిక గాయపడడంతో సినిమాని సెప్టెంబర్ 11 నుంచి పోస్ట్ పోన్ చేసారు మేకర్స్. ఆ విషయాన్నీ కన్ ఫర్మ్ చేసారు.
ఒక నెల లేట్ గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. సెప్టెంబర్ 11 న పోస్ట్ పోన్ అయిన రణబాలి అక్టోబర్ 16 న విడుదల చేస్తున్నట్టుగా అంటే దసరా బాక్సాఫీసు బరిలో రణబాలి ని విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ పవర్ ఫుల్ పోస్టర్ తో ప్రకటించారు. ఇప్పటికే రణబాలి పై మంచి అంచనాలున్నాయి.
పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ-రష్మిక కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం, అలాగే రణబాలి మేకింగ్ అన్ని సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇక దసరా హాలిడేస్ టార్గెట్ చేస్తూ రణబాలి విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు.







































