జైలర్ 2 పోస్ట్ పోన్ అవ్వబోతుందా..?
Jailer 2 Postponement Rumours
సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజీ సీక్వెల్ జైలర్2 చిత్రాన్ని అక్టోబర్ 15 న విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. దసరా బాక్సాఫీసు బరిలో జైలర్ 2 ని దించుతున్నట్టుగా అనౌన్స్ చేసారు. అప్పుడే అంటే అక్టోబర్ 16 న కోలీవుడ్ హీరో ధనుష్ ఓం తో దిగబోతున్నాడు. సో మామ-మాజీ అల్లుడు మధ్య బాక్సాఫీసు వార్ పక్కా అనుకున్నారు.
కానీ ఇప్పుడు సూపర్ స్టార్ జైలర్ 2 పోస్ట్ పోన్ కావొచ్చ.నే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అందుకే విజయ్ దేవరకొండ రణబాలి చిత్రాన్ని అక్టోబర్ 16 న రిలీజ్ అంటూ మేకర్స్ అనౌన్స్ చేసారని అంటున్నారు. జైలర్ 2 ని దసరా నుంచి పోస్ట్ పోన్ చేసి దివాళి కి రిలీజ్ చేసే ఆలోచనలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఉన్నారని అంటున్నారు.
మరి సోషల్ మీడియాలో విస్తరిస్తున్న జైలర్ 2 పోస్ట్ పోన్ వార్తలు నిజమైతే దసరా బరి లోకి వచ్చేందుకు మరికొంతమంది రెడీ అవుతారు. చూద్దాం జైలర్ 2 పోస్ట్ పోన్ వార్తలపై టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో అనేది.







































