మళ్లీ పుంజుకున్న రవితేజ ఇరుముడి
Ravi Teja's Irumudi back on track
గత ఐదు రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీసు ని షేకాడిస్తున్న మాస్ మహారాజ్ రవితేజ ఇరుముడి చిత్రం నిన్న టాక్సిక్ జాతరలో కాస్త డల్ అయ్యింది. యశ్ టాక్సిక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు మంచి ఊపు చూపించింది. కానీ టాక్సిక్ విడుదలయ్యాక ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.
అందులోను టాక్సిక్ టికెట్ రేట్ల హైక్, సినిమాకి నెగెటివ్ రెస్పాన్స్ రావడంతో రెండోరోజు టాక్సిక్ చూసేందుకు ఆడియన్స్ వెనకడుగు వెయ్యడం ఇరుముడి కి కలిసొచ్చింది. రవితేజ ఇరుముడికి సోషల్ మీడియాలో మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది. దానితో టాక్సిక్ చూద్దామని బుక్ చేసుకున్న వారు ఆ సినిమా టాక్ చూసి భయపడి ఇరుముడి కి వెళుతున్నారు.
అంతేకాదు వరస సెలవలు ఇరుముడి మళ్లీ పుంజుకోవడానికి కారణమయ్యాయి. టాక్సిక్ ప్రభావం తెలుగు థియేటర్స్ లో తగ్గడం ఇరుముడికి బాగా కలిసొచ్చింది. రేపు రాఖి సెలవు కూడా ఇరుముడి థియేటర్స్ ఫుల్ అవడం పక్కా.







































