డిస్ట్రిబ్యూటర్స్ vs ప్రొడ్యూసర్స్

Distributors vs ProducersDistributors vs Producers

 

సంక్రాంతి సినిమాల తర్వాత సెకండ్ హాఫ్ లో నెలకో సినిమా రూ.100 కోట్ల క్లబ్బులోకి వెళ్లడమే కాదు.. ఆ సినిమాలు థియేటర్స్ లో బాగా ఆడి బయ్యర్లకు లాభాలు వస్తున్నాయి. ప్రొడ్యూసర్స్ కన్నా బయ్యర్లకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. అయితే రూ.100 కోట్లు కొల్లగొట్టిన సినిమాలు మూడు నుంచి నాలుగు వారాలకే ఓటీటీ లో స్ట్రీమింగ్ లోకి వస్తున్నాయి.

మా ఇంటి బంగారం థియేటర్స్ లో రూ.100 కోట్లు రాగానే మూడు వారాలకే ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఎనిమిదివారాల గ్యాప్ కూడా నిర్మాతలు లెక్క చెయ్యకుండా మూడు, లేదా నాలుగు వారాల్లోనే హిట్ సినిమాలను కూడా ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.

థియేటర్స్ లో ఇంకా కలెక్షన్స్ తెస్తున్నా అవి ఓటీటీ లోకి వచ్చేస్తుంటే ఆడియన్స్ థియేటర్స్ కి ఏం వస్తారు. అదే ఇప్పుడు బయ్యర్ల బాధ. ఎనిమిదివారాలకే ఓటీటీ లో స్ట్రీమింగ్ చెయ్యకుండా ఉంటె థియేటర్స్ ని బ్రతికించుకోవచ్చు. ఎనిమిది వారాల గ్యాప్ కూడా వద్దు.. ఓటీటీ కి గ్యాప్ పెంచమంటుంటే.. తమకు ఓటీటీ డీల్స్ నుంచే ఎక్కువ మొత్తం బడ్జెట్ రికవరీ అవుతుంది అని వాదిస్తున్నారు నిర్మాతలు.

ఎనిమివారాల గ్యాప్ అయితే మంచి రాబడి ఉంది అని వారి వాదన. కానీ బయ్యర్లు థియేటర్స్ నుంచి లాభాలొచ్చే సినిమాలు కూడా ఓటీటీ డీల్ వల్ల చచ్చిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Producers