గ్లామరస్ సెల్ఫీ: పనిలో బిజీగా ఉన్న తార!
Kareena Kapoor Khan shares a glamorous selfie
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా వర్క్ లైన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన గ్లింప్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. షూటింగ్ సెట్స్‌లో దిగిన సరికొత్త గ్లామరస్ సెల్ఫీని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో కరీరా ఎంతో స్టైలిష్‌గా, రేడియంట్‌గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
గ్లామరస్ లుక్ కోసం కరీనా ఎంతో సింపుల్ అయిన మేకప్ .. ఎలిగెంట్ సైడ్ హెయిర్‌స్టైల్‌ను ఎంచుకున్నారు. తనదైన సహజమైన అందంతో కెమెరాకు పోజులిచ్చిన అమ్మడు ఆ ఫొటోకు `గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ సెట్`అనే క్యాప్షన్‌తో పాటు పిజ్జా ఎమోజీని జత చేశారు. వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన అప్డేట్లను ఎప్పుడూ అభిమానులతో పంచుకునే బ్యూటీ కరీనా మరోసారి వర్క్ మూడ్‌ను ఇలా షేర్ చేశారు.
కరీనా కపూర్ ఇటీవల వ్యక్తిగత జీవితానికి సంబంధించి వచ్చిన కొన్ని ఊహాగానాలపై కూడా స్పందించారు. జిమ్ నుంచి బయటికి వస్తున్న సమయంలో తీసిన ఓ వీడియో కారణంగా ఆమె మూడోసారి తల్లికాబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత అవన్నీ తప్పుడు కథనాలని తేలిపోయింది. ఈ విషయంలో కరీనాకు క్షమాపణలు తెలియజేసారు.







































