టాక్సిక్ పబ్లిక్ టాక్
Yash Toxic Social Media talk
కన్నడ పాన్ ఇండియా స్టార్ యశ్ లేటెస్ట్ చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ ఇంకా లేడీ సూపర్ స్టార్ నయనతార, రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తార సుతారియా నటించిన ఈ క్రేజీ పాన్ ఇండియా ఫిలిం ని KVN ప్రొడక్షన్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. నేడు వరల్డ్ వైడ్ గా టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టాక్సిక్ పబ్లిక్ టాక్ లోకి వెళితే.. టాక్సిక్ ఫస్టాఫ్ చాలా గందరగోళంగా ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నా.. టెక్నికల్ క్వాలిటీ బావున్నా సినిమా మొత్తం చెత్త చెత్తగా ఉంది, గజిబిజిగా, చిరాకు పుట్టించే స్క్రీన్‌ప్లే, యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆర్టిఫీషియల్ గా అనిపిస్థాయి. ఇక BGM గురించి ఏం చెప్పాలి, తీవ్రంగా నిరాశపరిచింది అంటూ టాక్సిక్ ని వీక్షించిన ఆడియన్స్ సోషల్ మీడియాలో ట్వీట్లు వేస్తున్నారు.
యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటర్వెల్, యష్-కియారా కాంబో సీన్స్ కాస్త బెటర్ గా ఉన్నాయి తప్ప మరేదీ చెప్పుకొవడానికి లేదు. ఎడిటింగ్ వీక్, కేరెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసే విధానము, డైలాగ్స్ బాలేదు, రవి బాస్రూర్ BGM అన్ని పరమ చెత్తగా ఉన్నాయ్ అంటూ మరికొంతమంది ఆడియన్స్ ట్వీట్లు వేస్తున్నారు.
ఇక సినిమా చూసి బయటికి వస్తూ.. టాక్సిక్ డిజాస్టర్, స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉంది, నీరసం వచ్చింది అంటూ పడి పడి నవ్వుతూ టాక్సిక్ పై స్పందిస్తున్నారు. ఈ సినిమా మ్యాట్నీ కల్లా థియేటర్స్ లో కనిపించదు అంటూ యశ్ టాక్సిక్ పై పబ్లిక్ రియాక్షన్ కనిపించింది.







































