ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Kiara Advani believes Toxic will become the biggest turning point of her career

సౌత్ లో కియార కెరీర్ డిసైడ్ అయ్యే క్షణం

Kiara Advani believes Toxic will become the biggest turning point of her careerKiara Advani believes Toxic will become the biggest turning point of her career

 

బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ అక్కడ హిందీలో సక్సెస్ అయినా.. సౌత్ లో అందులోను ఆమె తెలుగులో నటించిన మూడు సినిమాలు ఆమెకు షాకిచ్చాయి. రామ్ చరణ్ తో వినయ విధేయరామ, గేమ్ చేంజర్ చిత్రాలు చేసింది. సూపర్ స్టార్ మహేష్ తో భరత్ అనే నేను చేసింది. ఈమూడు చిత్రాలు కియారా కెరీర్ కి హెల్ప్ అవ్వలేదు.

సౌత్ లో ఆమె నటించిన సినిమాలన్నీ ప్లాప్.  ఆతర్వాత మళ్లీ చాలా రోజులకు కన్నడ టార్ యశ్ తో కలిస్ టాక్సిక్ చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో కియారా అద్వానీ గ్లామర్ షో, యశ్ తో ఆమె కాంబో సీన్స్ చూసిన వారు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్లు పెడుతున్నారో చూసారు.

ఇక కియారా సౌత్ కెరీర్ ని ఇప్పుడు ఈ చిత్రం టాక్సిక్ డిసైడ్ చేయబోతుంది. ఆమె టాక్సిక్ తో హిట్ కొడితే మళ్ళీ సౌత్ ఆఫర్స్ వస్తాయి. లేదంటే కియారా ని సౌత్ దర్శకుడు కన్సిడర్ చెయ్యాలని అనుకోరు. మరి కియారా అద్వానీ సౌత్ కెరీర్ డిసైడ్ అయ్యే క్షణం కోసం ఆమె ఎంతగా ఎదురు చూస్తుందో తెలియదు కానీ.. అభిమానులు మాత్రం తెగ వెయిట్ చేస్తున్నారు.

Kiara Advani