ఇరుముడిని ఆపే దమ్ముందా

Irmudi vs ToxicIrmudi vs Toxic

 

రవితేజ ఇరుముడిని ఆపే దమ్ము యశ్ టాక్సిక్ కి ఉందా.. ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో నడుస్తున్న ప్రశ్న. వీకెండ్ లోనే కాదు వర్కింగ్ డే సోమవారం కూడా ఇరుముడి థియేటర్స్ ప్రేక్షకులతో కళకళలాడాయి. ఈరోజు కూడా ఇరుముడి ర్యాంపేజ్ కనిపిస్తుంది. దానితో రవితేజ రూ.100 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అవడానికి సమయం దగ్గరపడిపోయింది.

మరి ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అయిన ఇరుముడి కి మరో వారం దొరికితే రవితేజ కెరీర్ లో ఇరుముడి బెస్ట్ ఫిలిం గా నిలిచిపోతుంది అనుకున్నారు. కానీ రేపు బుధవారం ఇరుముడి ఆట కట్టించేందుకు యశ్ టాక్సిక్ రెడీగా ఉంది. కానీ టాక్సిక్ కి ఇరుముడి ర్యాంపేజ్ ఆపే దమ్ముందా..

బోల్డ్ కంటెంట్ మూవీ, ఏ సర్టిఫికెట్ మూవీ.. హింసతో కూడిన కంటెంట్ కావడంతో టాక్సిక్ చూసేందుకు యూత్ వెళ్లినా ఫ్యామిలీస్ కనెక్ట్ అవడం కష్టం. ఇరుముడి మౌత్ టాక్ తో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. మరి టాక్సిక్ ఇరుముడి ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

Yash vs Ravi Teja