రుక్మిణి వసంత్ క్రేజ్- షాక్ లో యశ్

Rukmini Vasanth craze in Tamilnadu Rukmini Vasanth craze in Tamilnadu



కన్నడ భామ రుక్మిణి వసంత్ పాన్ ఇండియా లెవల్లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కాంతార 2 తర్వాత సౌత్ లో పాన్ ఇండియా స్టార్స్ సరసన నటిస్తున్న ఈ భామ రేపు బుధవారం వరల్డ్ వైడ్ గా మరో పాన్ ఇండియా ఫిలిం టాక్సిక్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. టాక్సిక్ మూవీలో రుక్మిణి వసంత్ కేరెక్టర్ ఎలా ఉంటుందో అనే ఐడియా ప్రేక్షకులకు లేదు.

కారణం నయనతార, కియారా అద్వానీ లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఈ టాక్సిక్ లో ఉన్నారు. అయితే టాక్సిక్ ప్రమోషన్స్ లో భాగంగా గత రాత్రి చెన్నై లో జరిగిన టాక్సిక్ ఈవెంట్ లో రుక్మిణి వసంత్ స్టేజ్ పైకి వస్తుంటే అక్కడ ఉన్న ఆడియన్స్ రుక్మిణి.. రుక్మిణి అంటూ అరవడం చూసి ఆశ్చర్యపోయిన దర్శకురాలు గీతూ మోహన్ దాస్ క్లాప్స్ కొడుతూ కనిపించారు.

హీరో యష్ అయ్యితే చెన్నై లో రుక్మిణి వసంత్ క్రేజ్ చూసి ఆశ్చర్యపోతూ షాక్ అయిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. రుక్మిణి మాట్లాడుతుంటే ఆడియన్స్ చేస్తున్న రచ్చ చూసి యాంకర్స్ కూడా వారిని అరవకండి అంటూ.. తమిళనాట రుక్మిణి క్రేజ్ ఇది అని చెబుతుంటే ఒకింత షాక్ అవుతూ యశ్ కూడా క్లాప్స్ కొట్టారు.

గతంలో రుక్మిణి వసంత్ తమిళ మూవీస్ లో నటించింది. అవేమి హిట్ అవ్వలేదు, కానీ ఆమెకు తమిళనాట భారీ క్రేజ్ పెరిగింది అనడానికి టాక్సిక్ ఈవెంట్ నిదర్శనం. ఆతర్వాత యశ్ స్టేజ్ పై ఎక్కి మాట్లాడుతూ.. రుక్మిణి వసంత్ ని పొగుడుతూ రుక్మిణి పాన్ ఇండియా హీరోయిన్ అంటూ మాట్లాడారు. మరి ఈ టాక్సిక్ రుక్మిణి కి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుందో అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. 

Rukmini Vasanth speech in Toxic Chennai event