పెళ్లి తర్వాత డల్ అయిన హీరో
Hero Naga Shaurya
ఈమధ్యన పెళ్లి తర్వాత అదృష్టం పట్టిన హీరోలు అంటూ అక్కి నేని అఖిల్, కిరణ్ అబ్బవరం లాంటి హీరోలను పొగిడిన నెటిజెన్స్ ఇప్పుడు పెళ్లి తర్వాత కనిపించకుండా పోయిన మరో హీరో గురించిన ముచ్చట లేవనెత్తారు. అఖిల్ కి పెళ్లి తర్వాత లెనిన్ తో రూ.100 కోట్ల హిట్టు దక్కింది. కిరణ్ ఆబ్బరం కూడా పెళ్లి తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు.
కానీ హీరో నాగ శౌర్య మాత్రం పెళ్లి తర్వాత డల్ అయ్యాడు. పెళ్లి తర్వాత నాగ శౌర్య పెద్దగా కనిపించింది లేదు. బ్యాడ్ బాయ్ కార్తీక్ ని కూడా ఏదో విడుదల చెయ్యాలి అని రిలీజ్ చేసి చేతులు దులుపుకున్న హీరో నాగ శౌర్య కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. మరి నాగ శౌర్య ఇకపై సినిమా చేస్తాడా, లేదా అనే అనుమానం మొదలయ్యింది.
పెళ్లి తర్వాత ఊపులో ఉండాల్సిన నాగ శౌర్య వరస వైఫల్యాలతో ఆ పెళ్లి తర్వాత యాక్టీవ్ గా లేకుండా డల్ అయ్యాడు. మరి నాగ శౌర్య తదుపరి చిత్రం, దానికి డైరెక్టర్ ఎవరు అనే విషయంలో ఎలంటూ రూమర్ కూడా వినిపించడం లేదు.







































