ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vishwambhara: It’s Turning Out Just as Expected

విశ్వంభర - అనుకున్నదే అయ్యేలా ఉంది

Vishwambhara: It’s Turning Out Just as ExpectedVishwambhara: It’s Turning Out Just as Expected


దర్శకుడు వసిష్ఠ అసలు విశ్వంభరను ఏం చేయాలనుకుంటున్నారు, సీజీ వర్క్ పేరుతొ కాలయాపన చేస్తున్నారా, లేదంటే అనేది ఎవ్వరికి అంతు బట్టడం లేదు. కోట్లు కుమ్మరించి తీసిన సినిమాలకు కూడా సీజీ వర్క్ కోసం ఇంత సమయం వెచ్చించరు. కానీ విశ్వంభర సీజీ లు కోసం ఏళ్లతరబడి వెయిట్ చేయిస్తున్నారు.

చిరు బర్త్ డే కి విడుదల తేదీ ఇస్తారనుకున్నారు, కానీ సీజీ వర్క్ చేతికందేవరకు విశ్వంభర విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చెయ్యలేరు. అది ఈ ఏడాది జరుగుతుందా అనే అనుమానం నిజమయ్యేలా ఉంది. ఈ ఏడాది విశ్వంభర విడుదల కష్టమే అనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సీజీ లు చేతికి వస్తే తప్ప సినిమా విడుదల డేట్ ఇవ్వడం కుదరదు. అది ఈ ఏడాది ఉండకపోవచ్చని అంటున్నారు. సో మెగా ఫ్యాన్స్ వచ్చే ఏడాది వరకు విశ్వంభర కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చెయ్యాల్సిందేమో అనేది. చూద్దాం వశిష్ట విశ్వంభరకు ఎప్పుడు మోక్షం ప్రసాదిస్తారో.
 

Vishwambhara: Looks Like It’s Going as Expected