ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Vijay Sai Reddy Sensational Comments on YS Jagan

జగన్ ను నట్టేట ముంచినట్టే

Vijay Sai Reddy Sensational Comments on YS JaganVijay Sai Reddy Sensational Comments on YS Jagan

 

వైసీపీ ఎంపీగా ప్రతిపక్షంపై చెలరేగిపోయిన విజయసాయి రెడ్డి కూటమి ప్రభుత్వం రాగానే కేసులకు భయపడి మాజీ సీఎం, తనకు రాజకీయ బిక్ష పెట్టిన జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వైసీపీ పార్టీ నుంచి బయటికి వచ్చేసారు. జగన్ చుట్టూ నలుగురు వ్యక్తులు కోటరీ కట్టారు. జగన్ దగ్గరకు కూడా వెళ్లలేకపోతున్నాము అంటూ విజయసాయి రెడ్డి లిక్కర్ కేసులో అప్రూవర్ గా మారారు.

ఇక విజయసాయి రెడ్డి కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ ఇప్పుడు ఉన్నట్టుండి యాక్టీవ్ అయ్యారు. శ్రావణమాసం నాలుగో వారంలో కొత్త పార్టీ పెట్టబోతున్నాను, నేను బీజేపీ లోకి వెళ్లబోతున్నాను అని చాలామంది అనుమానపడ్డారు, నేను ఏ పార్టీలోకి వెళ్లడం లేదు, నేను కొత్త పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నాను అంటూ చెప్పిన విజయసాయి రెడ్డి పనిలో పనిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ని విమర్శించారు.

అసమర్ధ ముఖ్యమంత్రి చంద్రబాబు అని, ఒక్కరున్నా ప్రతిపక్షమే అన్న విజయసాయిరెడ్డి, ప్రతిపక్ష పాత్ర పోషించలేని జగన్ కూడా అసమర్థనేత అంటూ తీవ్ర విమర్శలు చేసారు. అంతేకాదు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మీడియా ముందు నట్టేట ముంచేశారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మతమార్పిడులను ప్రోత్సహించారని.. ఆరోపణలు చేసారు.

ఆంధ్రలో జగన్ మోహన్ రెడ్డి  కొన్ని వందల చర్చిలు కట్టడానిక సహకరించారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతేకాదు అసలు హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి జగన్ సహకరించలేదని విజయసాయిరెడ్డి చెప్పడం చూసిన వారు అమ్మో విజయసాయి రెడ్డి జగన్ ను కోలుకోలేని దెబ్బకొట్టడమే కాదు నట్టేట ముంచేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Vijaya Sai Reddy Sensational Comments On YS Jagan As Opposition