టాక్సిక్ తెలుగు టార్గెట్

Toxic telugu TargetToxic telugu Target


కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన టాక్సిక్ చిత్రం మరో రెండు రోజుల్లో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 8 నుంచి టాక్సిక్ ని ఇండియా వైడ్ గా యాష్ అండ్ హీరోయిన్స్ తెగ ప్రమోట్ చేస్తున్నారు. బెంగుళూరు ఈవెంట్, హైదరాబాద్, చెన్నై, ముంబై ఇలా టాక్సిక్ ని ప్రమోట్ చేస్తున్నారు.

తెలుగులో దిల్ రాజు టాక్సిక్ ని రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు దాదాపు రూ. 100 కోట్లకు మార్కెట్ అయ్యాయి. ఇక ఇప్పుడు తెలుగులో టాక్సిక్ టార్గెట్ రూ.200 కోట్లు గా చెబుతున్నారు. టాక్సిక్ తెలుగు నుంచే రెండొందల కోట్లు కొల్లగొట్టాలి.. ప్రస్తుతం ఉన్న హైప్ ముందు అది పెద్ద ఫిగరేమి కాదు అంటున్నారు.

మరి తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారు అని ఈ ఏడాది తమిళ డబ్బింగ్ సూర్య కరుప్పు, మలయాళ డబ్బింగ్ మోహన్ లాల్ దృశ్యం 3 నిరూపించాయి. అలానే టాక్సిక్ కి కూడా హిట్ టాక్ పడితే ఇక్కడ రూ.200 కోట్లు తేవడం పెద్ద విషయం కాదు అంటున్నారు. చూద్దాం తెలుగులో యశ్ టాక్సిక్ స్టామినా ఎంతో అనేది. 

Toxic Telugu Breakeven