హిట్టు ఊపునిస్తుంది అంటే ఇదే

Irumudi Success CelebrationsIrumudi Success Celebrations


కొన్ని సినిమాల నుంచి నిరాశ పరిచే ఫలితాలను అందుకుని కెరీర్ లో బాగా డల్ అయిన హీరోకి హిట్టు పడితే ఉంటుంది.. ఊపు ఊపొచ్చేస్తుంది. అదే ఇప్పుడు రవితేజ విషయంలో జరుగుతుంది. ఇరుముడి రవితేజ ను మళ్లీ పైకి లేపింది. ప్రమోషన్స్ అంటే దూరంగా ఉండే రవితేజ ఇరుముడి ప్రతి ప్రమోషన్ లోను కనిపించడమే కాదు..

ఇరుముడి సక్సెస్ సెలెబ్రేషన్స్ కు డాన్స్ చేస్తూ రావడం చూసి ఇరుముడి హిట్టు తో రవితేజ అస్సలు ఆగడం లేదుగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేసేలా రవితేజ ఎనర్జిటిక్ గా కనిపించారు. మరి సక్సెస్ ఊపునిస్తుంది అంటే ఇదే కదా అని నెటిజెన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు.

కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా.. ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన ఎమోషన్స్ ఇరుముడిలో ఉండడంతో కుటుంబ ప్రేక్షకులు ఇరుముడి చిత్రాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. దానితో రెండు రోజుల్లోనే రవితేజ బ్రేక్ ఈవెన్ సాధించి మరీ ఆ సక్సెస్ ని ఈరోజు సోమవారం డాన్స్ చేస్తూ ఉల్లాసంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 

Ravi Teja Irumudi Success Celebrations