సర్జరీ తర్వాత ఓ వేడుకలో భర్త తో రష్మిక
Rashmika and VD made a joint public appearance
రీసెంట్ గా సినిమా షూటింగ్ లో రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. రష్మిక గాయానికి సర్జరీ చేయించుకుని ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. తాను వరస సినిమా షూటింగ్స్ తో తీరిక లేకుండా పని చేస్తుంటే.. దేవుడే నాకు రెస్ట్ ఇచ్చినట్టుగా ఉన్నాడు అంటూ ఈమధ్యనే రష్మిక సరదాగా పోస్ట్ పెట్టింది.
ఇక ఆమె కుడి తుంటిలోని టెండన్ సర్జరీ తర్వాత మొదటిసారి పబ్లిక్ అప్పీరియన్స్ ఇచ్చింది. భర్త విజయ్ దేవరకొండ తో కలిసి రష్మిక ఓ నిశ్చితార్ధ వేడుకకు వచ్చిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఆదివారం ప్రముఖ నిర్మాత ఎస్. నిరంజన్ రెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
ఈ వేడుక కోసం రష్మిక ట్రెడిషనల్ గా బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ లెహంగాలో రెడీ అవ్వగా.. విజయ్ దేవరకొండ బ్లాక్ కుర్తాలో క్లాసీ లుక్ లో కనిపించారు. ఈ వేడుకకు చాలామంది సినీప్రముఖులు హాజరయ్యారు. కానీ అందులో రష్మిక-విజయ్ దేవరకొండ లే స్పెషల్ గా కనిపించారు.
రష్మిక గాయం నుంచి కోలుకుంటూ ఇలా భర్త తో కలిసి ఎంగేజ్మెంట్ వేడుకకు రావడం అభిమానులను ఉత్సాహపరిచింది. ఆమె గాయం నుంచి త్వరగా కోలుకుని షూటింగ్ కి హాజరవ్వాలని వారు కోరుకుంటున్నారు.







































