ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Baba Ramdev refuses to comment on Kangana Ranaut

కంగ‌న‌పై కామెంట్ కూడా అన‌వ‌స‌రం లేదు!

Baba Ramdev refuses to comment on Kangana RanautBaba Ramdev refuses to comment on Kangana Ranaut

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్ - ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ మధ్య ఇటీవల చెలరేగిన వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దేశంలోని నేటి యువతరం గురించి కంగనా చేసిన  వివాదాస్పద వ్యాఖ్య ఈ ఘర్షణకు ప్రధాన కారణమైంది. యువతపై ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన బాబా రామ్‌దేవ్ నేరుగా ఆమె గత జీవితం ..వ్యక్తిగత వ్యవహారాలపై విమర్శలు గుప్పించారు.

యువతను కించపరిచేలా కంగనా మాట్లాడటం సరైన పద్ధతి కాదని, ఎవరి గురించైనా మాట్లాడే ముందు వారి గత చరిత్రను పరిశీలించుకోవాలని బాబా రామ్‌దేవ్ ఘాటుగా స్పందించారు. దేశంలోని యువతను ఉద్దేశించి అలాంటి పదజాలం వాడటం అనూహ్యమైన విషయమని ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించడంతో పాటు.. ఇద్దరు ప్రముఖుల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి.

బాబా రామ్‌దేవ్ విమర్శలపై కంగనా రనౌత్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితంపై అనవసర వ్యాఖ్యలు చేయవద్దని, ఇతరులకు నీతులు చెప్పే ముందు తమ చుట్టూ ఉన్న పరిణామాలను గమనించుకోవాలని  ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఈ పబ్లిక్ వార్ సోషల్ మీడియాలో  వైరల్ కావడంతో ఈ అంశంపై అన్ని వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా ప్రతినిధులు ఈ వివాదం గురించి ప్రశ్నించగా బాబా రామ్‌దేవ్  ఆసక్తికరమైన రీతిలో స్పందించారు. తాను ఈ వివాదానికి మ‌రింత ప్రాధాన్యం ఇవ్వదలుచుకోలేదని.. అనవసర విషయాలపై మాట్లాడి వివాదాలను పెంచలేనని స్పష్టం చేశారు. దేశం కోసం తాను చేసిన సేవలు ఏమిటో ప్రజలందరికీ తెలుసని.. అందుకే తాను అలాంటి వారి గురించి మాట్లాడటానికి ఇష్టపడనంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు.

ప్రముఖుల మధ్య ఈ తరహా సైద్ధాంతిక - వ్యక్తిగత విమర్శలు నడుస్తుండటం వల్ల ఇది సోషల్ మీడియాలో నిత్యం చర్చనీయాంశంగా మారుతోంది. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ,  ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం ప్రజల్లోనూ తీవ్ర చర్చకు దారితీస్తోంది. సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలు చేసే ప్రతి చిన్న వ్యాఖ్య ఎంత పెద్ద దుమారానికి దారితీస్తుందో? ఈ ఉదంతం మరోసారి నిరూపించింది.

Baba Ramdev vs Kangana Ranaut