ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Tollywood actor Prince Cecil is all set to enter a new chapter

న్యూజిలాండ్ లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడు

 Tollywood actor Prince Cecil is all set to enter a new chapterTollywood actor Prince Cecil is all set to enter a new chapter


టాలీవుడ్ యాక్టర్ ప్రిన్స్ పెళ్లి కొడుకయ్యాడు. సినిమాలో కేరెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రిన్స్.. సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ తో బాగా ఫేమస్ అయ్యాడు. విలన్ కేరెక్టర్స్ లో కనిపించే ప్రిన్స్ బిగ్ బాస్ రియాలిటీ షో కి కూడా వెళ్లి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

ఇప్పుడు ప్రిన్స్, సాయి మాచిరాజు(సాయి ప్రతిమ) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇరు కుటుంబాల నడుమ న్యూజిలాండ్ లో తెలుగు సాంప్రదాయంలో ప్రిన్స్, సాయి మాచిరాజు మెడలో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచారు. ప్రస్తుతం ప్రిన్స్ పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రిన్స్ పెళ్ళికి కుటుంబ సభ్యులు, అలాగే కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్ హాజరైనట్టుగా తెలుస్తుంది. ప్రిన్స్ పెళ్లి ఫొటోస్ షేర్ చెయ్యగానే ఆయనకు ఫ్రెండ్స్, మిగతా వారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Wedding bells for Prince