ఇరుముడి వీకెండ్ పోస్టర్

Irumudi weekend collectionsIrumudi weekend collections

 

రవితేజ ఇరుముడి చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవడంతో పెద్ద హిట్ గా నిలిచింది. ఇరుముడి థియేటర్స్ అన్ని మల్లెపూల పల్లకి సాంగ్ తో ఊగిపోతున్నాయి. ప్రేక్షకులైతే ఇరుముడి థియేటర్స్ లో ఆ సాంగ్ వస్తుంటే హారతులు పడుతున్నారు. రవితేజ యాక్టింగ్ కి ఫిదా అవుతున్నారు.

దానితో మొదటి రోజు రూ.30 కోట్ల గ్రాస్ తో రవితేజ కెరీర్ లో ఇరుముడి బెస్ట్ ఓపెనింగ్స్ ఇవ్వగా రెండో రోజుకి ఇరుముడి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. రెండు రోజులకు గాను ఇరుముడి రూ.65 కోట్ల గ్రాస్ తీసుకురాగా.. ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ఇరుముడి రూ.80 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది.

మూడు రోజుల్లోప్రపంచ వ్యాప్తంగా రూ.80 కోట్ల తో రవన్న బాక్సాఫీసు ర్యాంపేజ్ అంటూ మేకర్స్ అధికారికంగా ఇరుముడి మూడు రోజుల్లో కలెక్ట్ చేసిన కలెక్షన్స్ పోస్టర్ వదిలారు. 

Irumudi 3 days collections poster